Suresh Kolichala
Suresh Kolichala
@sureshk.bsky.social
Dravidian languages, Historical linguistics, Indology, Unicode.
నళినోదరుభక్తునిఁ గని
కులజులు ప్రమదాశ్రుజలము గురియు తెఱఁగు మ్రాఁ
కులు పూదేనియ లొలికెడు
నలినాక్షుని చేతి వంశనాళము మ్రోతన్.

పద్మనాభుడైన విష్ణుమూర్తి సన్నిధిలో భక్తునిగా ఉండడం చూసిన అతని కులం వారు ఆనందబాష్పాలు కార్చినట్లు, కమలాక్షుడు శ్రీకృష్ణుని కమ్మని పిల్లనగ్రోవి పాటలు విని ఆ వెదురు చెట్లు పూదేనియలను జాలువారుస్తున్నాయి.
November 17, 2024 at 3:53 PM
ముదితా! యే తటినీ పయఃకణములన్ మున్ వేణు వింతయ్యె నా
నది సత్పుత్రునిఁ గన్నతల్లి పగిదిన్ నందంబుతో నేడు స
మ్మద హంసధ్వని పాటగా వికచపద్మశ్రేణి రోమాంచమై
యొదవం దుంగతరంగ హస్తనటనోద్యోగంబు గావింపదే!

విరిబోణీ! ఏ నదీజల బిందువులతో ఈ వేణువు ఇంతగా వర్ధిల్లిందో ఆ నదీమతల్లి, మంచి కొడుకును కన్న మాతృదేవత లాగ, మహానందంతో; మత్తిల్లిన రాయంచల రవళి అనే గానంతో; వికసించిన పద్మాలు అనే రోమాంచములతో; చెలరేగిన అలలనే హస్తాలతో ఈనాడు నాట్యం చేయకుండా ఉంటుందా?
November 17, 2024 at 3:53 PM
ఒనరన్ వ్రేతల కించుకేనియును లేకుండంగ గోపాలకృ
ష్ణుని కెమ్మోవి సుధారసంబు గొనుచుం జోద్యంబుగా మ్రోఁయుచుం
దన పర్వంబులు నేత్రపర్వములుగా దర్పించెఁ, బూర్వంబునన్
వనితా! యెట్టి తపంబు జేసెనొకొ యీ వంశంబు వంశంబులోన్.
ఈ వేణువు మునుపు ఏం తపస్సులు చేసిందో కాని ఇలా వెదురు వంశంలో జన్మించి కృష్ణుడి మోవిని అందుకుంది. గొల్లభామలకు ఇసుమంతైనా మిగల్చకుండా గోపాలకృష్ణుని అధరసుధలను ఆస్వాదిస్తూ వింతమ్రోత లీనుతున్నది. స్వరాలొలికే వెదురు కణుపులతో అందగిస్తూ కనులపర్వం గావిస్తూ వెదురుకులంలో గొప్పదాన్నని గర్వంతో మిడిసిపడుతున్నది.
November 17, 2024 at 3:52 PM
గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణు-
ర్దామోదరాధరసుధామపి గోపికానామ్ ।
భుఙ్క్తే స్వయం యదవశిష్టరసం హ్రదిన్యో
హృష్యత్త్వచోఽశ్రు ముముచుస్తరవో యథార్యా: ॥ 10.21.9॥

గోపికలారా! ఏ పుణ్యవ్రతం ఆచరించిందని ఆ వేణువు (గోపికలకు చెందాల్సిన) దామోదరుని అధరసుధను స్వయంగా/తానొంటిగా గ్రోలుతోంది? ఆ వేణువుకు పితరులైన అయిన వెదురు చెట్టు అది చూసి ఆనందభాష్పాలు రాలిస్తే, తల్లిరూపమైన ఆ నదీమతల్లికి హర్షాతిరేకం వల్ల వికసించిన పద్మాలు అనే రోమాంచములు మొలకెత్తాయి, చూడండే!
November 17, 2024 at 3:49 PM