మనతెలుగుమాట
banner
manatelugumaata.bsky.social
మనతెలుగుమాట
@manatelugumaata.bsky.social
తెలుగు అంటే అభిమానం. నా #ఆలోచనలు నా #అనుభవాలు #మనతెలుగుమాట

My Twitter: https://x.com/manatelugumaata?t=RulHg74ebI4bzwLFP4VBuA&s=09

ముఖపుస్తకం(ఎఫ్ బి) : https://www.facebook.com/profile.php?id=100080812381273
నువ్వు కొన్న ధర కంటే ఎక్కువ ధరకి అమ్మగలిగేది ఆస్తి

నువ్వు కొన్న ధర కంటే తక్కువ ధరకి అమ్మాల్సి వచ్చేది భారం

#ఆర్థికఅక్షరాస్యత #తెలుగు #Telugu #మనతెలుగుమాట
September 2, 2025 at 1:07 AM
చెడు అలవాట్లు ఉండే వారు ఆ అలవాట్లు లేని వాళ్ళకి " జీవితాన్ని అనుభవించాలిరా " అని ఉచిత సలహా ఇస్తారు

తమది చెడు అలవాటు అని ఒప్పుకోలేక అదే జీవితాన్ని అనుభవించటం అని రుద్దుతారు

మళ్ళీ వాళ్ళకి లేని చెడు అలవాటు ఇంకెవరికైనా ఉంటే అది జీవితాన్ని అనుభవించటం అనిపించదు వాళ్ళకి 😀

#అలవాట్లు
August 28, 2025 at 1:02 AM
నువ్వు ఎవరితో పోటీపడుతున్నావ్ అన్నదాన్ని బట్టి ఉంటుంది నీ జీవితం

వెదవలతో పోటీ పడితే నువ్వు వెదవ అవుతావ్

తెలివిగల వారితో పోటీపడితే నువ్వు తెలివిగల వాడివి అవుతావ్

#పోటీ #ఎవరితో #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 26, 2025 at 1:16 AM
రేపటి చప్పట్లు వినాలి అంటే ఇవ్వాల్టి అవమానం బరించగలగాలి

పరిస్థితులు చెయ్యి జారకుండా ఉండాలంటే ఒక్కోసారి మన నోరు మూసుకోవాలి

జీవితం నాశనం కాకుండా ఉండటానికి కొన్నిసార్లు మన అహాన్ని చంపుకోగలగాలి

#రేపు #ఇవ్వాళ #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 25, 2025 at 12:54 AM
ఆత్మగౌరవం ఉండేవారు తమ అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు తామే ఏర్పరచుకుంటారు

ఆత్మగౌరవం లేని వారు

ఇతరుల ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలనే తమ ఇష్టాయిష్టాలుగ, అభిప్రాయాలుగా ఏర్పరచుకుంటారు, చెప్పుకుంటారు.

#ఆత్మగౌరవం #అభిప్రాయం #ఇష్టం #అయిష్టం #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 24, 2025 at 1:27 AM
నీ చుట్టూ ఉండే వారిలో మంచి లక్షణం కనిపిస్తే ఆ లక్షణం గురించి వారికి చెప్పండి

అలా చెప్పేవారు తక్కువ ఈ రోజుల్లో

మీకు ఎవరైనా అలా మీలో మంచి గురించి చెప్పి ఎన్నాళ్ళయింది ఆలోచించండి

#మంచి #చెప్పండి #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 23, 2025 at 1:40 AM
నీ ఆనందమైన, బాధైన నువ్వు నియంత్రించుకోగలగటం అతి పెద్ద అదృష్టం

దాని అర్ధం బాధ ఉన్నప్పుడు బాధ పడకూడదు అని కాదు

ఆనందంగా ఉన్నప్పుడు ఆస్వాదించకూడదు అనికూడా కాదు

ఏదైనా మోతాదుని మించకూడదు అని అంతే

#ఆనందం #బాధ #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 22, 2025 at 12:44 AM
డబ్బు నువ్వు కలవాలి అనుకున్న వారిని నీకు దగ్గర చేస్తుంది

వాళ్ళు నీతో ప్రయాణం కొనసాగించాలి అంటే మాత్రం నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది

#డబ్బు #ప్రవర్తన
#తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 21, 2025 at 12:58 AM
డబ్బున్నవాడి ఆర్భాటానికి పేదవాడు మురిసిపోతే,
పేదవాడి ఓర్పుకి డబ్బున్నవాడు ఆశ్చర్యపోయాడట.

#డబ్బు #ఆర్భాటం #ఓర్పు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 17, 2025 at 12:13 AM
సగం తెలుసుకుని సై అనేవాడి కన్నా
ఏమి తెలియని వాడి వల్ల నష్టం తక్కువ

అర్ధజ్ఞానంతో సలహా ఇచ్చే వాడికన్నా
నాకు తెలియదు అని మౌనంగా ఉండేవాడి వల్ల నష్టం తక్కువ

మనల్ని ప్రేమించని వారికన్నా
ప్రేమించి మద్యలో వదిలేసే వారి వల్ల అయ్యే గాయాలు ఎక్కువ

#ప్రేమ #అర్ధజ్ఞానం #తెలుగు #Telugu #గాయం
August 16, 2025 at 1:56 AM
కుటుంబ సభ్యులని చిరాకు పడుతూ, అగౌరపరుస్తూ
బయట వారితో గౌరవంగా, ప్రేమగా మాట్లాడే వాళ్ళు
ఇద్దరిని కోల్పోతారు.

#చిరాకు #కోల్పోతారు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 12, 2025 at 1:15 AM
నీకు నచ్చినట్టు నీ జీవితం లేదు అంటే
నీకు ఉండకూడని అలవాటు ఏదో ఉందని అర్థం.

#జీవితం #అలవాటు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 11, 2025 at 12:54 AM
కర్రలేని వాడిని కరిచే కుక్కలు ఎక్కువ
అండలేని వాడిని అనేవాళ్ళు ఎక్కువ

#అండ #కుక్క #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 9, 2025 at 1:48 AM
ఆదాయంతో పాటు అదృష్టం
అనారోగ్యంతో పాటు ఒంటరితనం
అవే వస్తాయి

#ఆదాయం #అనారోగ్యం #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 8, 2025 at 1:24 AM
నిజం తెలిశాక నీ అభిప్రాయం, నీ ప్రవర్తన మార్చుకోవటం తప్పు కాదు

మార్చుకోకపోవడం తప్పు.

#నిజం #మార్పు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 7, 2025 at 12:49 AM
విచిత్రం ఏంటంటే

అబద్ధం చెప్పటానికి తెలివి ఉండాలి
నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి

అన్న పరిస్థితులు ఉన్న రోజులివి

అబద్ధం చెబుతున్నారు అంటే అమ్ముడుపోయారు అని

నిజం చెబుతున్నారు అంటే విలువలు ఉన్నాయి అని అర్ధం చేసుకోరు చాలా మంది

#అబద్ధం #నిజం #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 6, 2025 at 1:24 AM
ఆలోచన లేని వారు ఆపద
పట్టుదల లేని వారు పరాజయం

ఎదుర్కోక తప్పదు

#ఆలోచన #పట్టుదల #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 5, 2025 at 1:13 AM
సహాయం అవసరమైనప్పుడు ఒక్కడు చెయ్యందిస్తే

పరామర్శలకి మాత్రం పది మంది నోరందిస్తారు

#సహాయం #పరామర్శ #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 4, 2025 at 12:47 AM
నీ వల్ల నీతో ఉండే వాళ్ళు, నీ చుట్టు ఉండే వాళ్ళు

ఏమి కోల్పోతున్నారు
ఎంత ఇబ్బంది పడుతున్నారు
ఏమి వదులుకుంటున్నారు
ఎంత నష్టపోతున్నారు

తెలుసుకోక పోవటం
ఆలోచించక పోవటమే

" స్వార్థం "

#స్వార్థం #నువ్వు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 3, 2025 at 1:43 AM
నాగలి దున్నిన కష్టాన్ని గాలివాన కొట్టుకుపోయినట్లు

పూలమ్మ కట్టిన దండను, కోతులమ్మ చిందరవందర చేసినట్లు

ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ సంపాదించుకున్న పరువు ఒక్క తొందరపాటు పనితో పోతుంది

#నాగలి #అడుగు #తొందరపాటు
#తెలుగు #Telugu #మనతెలుగుమాట
August 2, 2025 at 1:52 AM
నీకు తెలియని విషయం గురించి నువ్వు వాదించటమే నువ్వెంత తెలివితక్కువ వాడివో ఎదుటి వారికి తెలుపుతుంది.

#వాదన #తెలివి #తెలుగు #Telugu #మనతెలుగుమాట
July 31, 2025 at 1:02 AM
ఇష్టం లేనప్పుడు, నచ్చనప్పుడు వద్దు\కాదు అని గౌరవంగా చెప్పగలగడం గొప్ప ప్రతిభ,అలా చెప్పలేక చాలా మంది జీవితంలో నష్టపోతారు.

#ఇష్టం #వద్దు #కాదు
#తెలుగు #Telugu #మనతెలుగుమాట
July 30, 2025 at 1:25 AM
వాస్తవానికి
90 శాతం సమస్యలు
డబ్బు లేకపోవడం దగ్గరికి వచ్చి ఆగుతాయి.

#డబ్బు #సమస్యలు
#తెలుగు #Telugu #మనతెలుగుమాట
July 28, 2025 at 1:01 AM
మంటలు చల్లారాక మిగిలేది బూడిదే
ఆవేశం తీరాక మిగిలేది పశ్చాతాపమే

#బూడిద #పశ్చాతాపం #ఆవేశం #మంటలు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
July 27, 2025 at 12:29 AM
ఎవరి కోసం ఎవరిని వదులుకుంటున్నావ్
వేటి కోసం వేటిని వదులుకుంటున్నావ్

అన్నదాన్ని బట్టి
నీ జీవితం ఎలా ఉంటుంది
నువ్వు ఎలా ఉంటావ్

అన్నది ఉంటుంది

#జీవితం #కోసం #ఎవరు #ఏవి #తెలుగు #Telugu #మనతెలుగుమాట
July 26, 2025 at 2:00 AM